ముళ్ళమూరు మండలంలోని కెల్లంపల్లి, పెద ఉల్ల గల్లు గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఈవో పి ఆర్ డి. పి ఓబులేసు శుక్రవారం ప్రారంభించారు. ఈ చలివేంద్రాలు కె ల్లంపల్లి గ్రామ సర్పంచి జమ్ముల గురువయ్య, పెదఉల్ల గళ్ళు సర్పంచి జనమాల నాగేంద్ర పిచ్చయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు, బాటాసారులకు, కార్మికులకు, రైతులకు, ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు . ప్రజలు ఎండను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు బి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, మనోహర్, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు
