బహిర్గతమైనది. పార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి బొటుకు రమేష్. ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరి కూటి నాగరాజులో నియోజక వర్గంలో పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కోణంలో నియోజక వర్గంలో క్రియాశీలక సభ్యత్వాల నమోదు ఇరువురు తమకు చెందిన కార్యకర్తలచే చేయించారు. అయితే దర్శి పట్టణంలో శుక్రవారం గణేష్ గెస్ట్ హౌస్ లోని సమావేశపు మందిరంలో జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు అధ్యక్షతన క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీంతో బొటుకు రమేష్ కు చెందిన వర్గం కార్యకర్తలు గైర్హాజరు. అయ్యారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాష్ట్ర పార్టీ యువ నాయకుడు దాసరి కిరణ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొందరు వర్గాలను ప్రొత్సాహిస్తున్నారని సభలో తమ అభిప్రాయాలను తెలిపారు.
మంచి చేస్తున్న జగన్ ను ఎందు సమర్థించటం లేదు అని ప్రశ్నించిన జనసేన
నాయకుడు ..
ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు సీఎం వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు పార్టీలకు అతీతంగా నవరత్నాలు అందిస్తున్నారు. గ్రామాలలో ఆయనకు మద్దతుగా ప్రజలు ఉన్నారు. అయితే మన పార్టీ ఎందుకు సపోర్టు చేయటం లేదని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన అధికార ప్రతినిధి రాయపాటి ఎంత మంచి చేసిన అందరికి నచ్చాలని లేదు కదా! మన పార్టీ లైన్ తీసుకుని వెళ్లాలి అని సర్ధి చెప్పారు. జనసేన అధినేత కష్టపడుతున్నారని,
కుక్కును నిలుచోబెట్టునా సరే కార్యకర్తల బాధ్యతగా గెలిపించుకోవాలని అని చెప్పారు. పార్టీలో వర్గాలు ఉంటే 2024 తర్వాత మరలా కొట్టుకుందామని ఇప్పుడు కాదని చెప్పుకొచ్చారు. కొందరు ప్రొటోకాల్ ప్రకారం జరగటం లేదని తమ వాదన వినిపించారు.
