రంజాన్ క్రమశిక్షణ,ధాతృత్వం, ధార్మిక చింతనల కలయిక అని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …. మత సామరస్యానికి, పరస్పర సదవగాహనకు ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని తెలిపారు. నెలరోజులు కఠోరవ్రతం పాటించిన వారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం లభించే రోజు అని ఆయన అన్నారు.ఈ మాసం వాతావరణం అంతా పుణ్య కార్యం, దైవభీతి అనే సుగుణాలతో నిండిందన్నారు. రంజాన్ మాసంలో వికసించిన ఆధ్యాత్మికత, ప్రేమ,దయ,సామరస్యపు కుసుమాలు ప్రజల జీవితాలలో గుభాళించాలని ఆయన ఆకాంక్షించారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
21
Apr