ఆంధ్రప్రదేశ్ లో మే రెండో వారంలో అనుకున్న విధంగానే పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం రాష్ట్ర సంచాలకుడు
డి.దే వానందరెడ్డి తెలిపారు.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని యాంప్తిల్ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్పాట్ వాల్యూయేషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రణాళికాబద్ధంగా జరుగుతోందన్నారు.
ఈ నెల 26వ తేదీకి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేసి మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో పది ఫలితాలు మే రెండో వారంలో విడుదల !
23
Apr