దర్శి నియోజకవర్గంలో వడగల్ల గాలి వాన – నేలకొరిగిన అరటి తోట – లేచిన పూరికప్పులు -శామంతపూడిలో పిడుగుపాటుకు ఒకరు మృతి

దర్శి నియోజకవర్గంలో ఆదివారం వడగల్లు, పెద్దపాటి ఉరుములతో గాలి వాన కురిసింది. దీంతో కళ్లాలలో ఉన్న మిరప రైతులు, మొక్కజొన్న రైతులు వాటి సస్యరక్షణకు పరుగులు తీసారు. తాళ్లూరు మండలం కొత్తపాలెంలో రైతు కోట సుబ్బా రెడ్డికి చెందిన అరటి తోట గాలి వానకు ద్విసం అయినది. రూ. 3లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. బొద్దికూరపాడులో ప్రాధమిక పాఠశాల (జనరల్)కు ఎదురుగా ఉన్న పూరి ఇల్లు కప్పులు లేచి పోయాయి. దీంతో సమీపంలో పాఠశాలకు పరుగులు తీసారు. నాగంబొట్లపాలెంలో చిన్నారిఫై వడగల్లు పడటంతో తలకు గాయమైనది. పెద్ద పాటి వడగల్లు పడటంతో పశువులు, జీవాలు పరుగులు తీసాయి. కట్టి వేసిన పశువులు వడగల్ల దెబ్బకి ఆరుపులు అరిసాయి. వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ప్రజలు ఎక్కడికక్కడ తల దాచుకున్నారు. దర్శి మండలం శామంతపూడిలో పిడుగుపాటుకు పోకూరి తిరుపతయ్య (47)మృతి చెందాడు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *