మైనర్ విద్యార్థిని లైంగిక వేధింపులపై కేసు నమోదు

తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ఓ ప్రవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని అదే పాఠశాలకు చెందిన ఓ డైరెక్టర్ లైంగిక, మానసిక వేధింపులపై కేసు నమోదు అయినట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తరచూ అనారోగ్యానికి గురౌతున్నది. ఇదే
విషయమై తల్లి విద్యార్థిని విచారించగా విద్యార్థి ఆవేదనతో అసలు విషయం తెలియజేసింది. అదే పాఠశాలకు చెందిన డైరెక్టర్ కమ్ సబ్జెక్ట్ టీచర్ మారం రమణా రెడ్డి గత కొన్ని నెలలుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తల్లికి, బంధువులకు తెలిపినది. ఇదే విషయాన్ని పాఠశాల కరస్పాండెంట్కు తెలిపినా సరే ఫలితం లేక పోవటంతో వారి బందువులు అతనిపై దాడి చేసారు. సంఘటనపై విచారించి పోలీసులకు విచారణలో పలు విషయాలు తెలియటంతో బాలికను విచారించి ఫోక్స్ చట్టం క్రింద శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై
వివరించారు. ఈ ఘటనలో ముద్దాయి మారం రమణా రెడ్డిపై దాడి చేసిన బంధువు
నాగార్జునపై కూడ కౌంటర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *