భూముల యజమానులు దగ్గరుండి భూముల రీ సర్వే చేయించుకోవాలి

భూములు గల యజమానులు ప్రభుత్వం చేస్తున్న భూముల రీ సర్వేకు భూముల గలవారు దగ్గరుండి రీ సర్వే చేయించుకోవాలని తహసిల్దార్ ఎండి నయీమ్ అహ్మద్ అన్నారు మండలంలోని ముండ్లమూరు, ఉమామహేశ్వరపురం, చింతలపూడి, వేముల, వేముల బండ, అవిసెన వారి పాలెం, గ్రామాలలో సోమవారం భూముల రీ సర్వే కు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ భూ వివాదాలు తగ్గాలంటే భూముల రీ సర్వే తో ఎవరు భూములు వారికి చెందుతాయన్నారు. భూమి యజమానులందరూ మీ గ్రామాల్లో చేస్తున్న సర్వే బృందాల దగ్గరికి వెళ్లి మీ దగ్గర ఉన్న అన్ని హక్కులకు సంబంధించి పత్రాలను సర్వే బృందాలకు చూపించాలన్నారు. భూములు గలవారు ఫోటో ఆధార్ కార్డు , బ్యాంకు ఎకౌంటు బుక్కు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలను వీఆర్వోలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్. సర్వేయర్ శివప్రసాద్, వీఆర్వోలు దయానందం, సుశీల, రవి. కోటయ్య, మురళి, జాన్ లిపి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *