తాళ్లూరు మండలం లో ఘనంగా జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం నిర్వహణ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల బలోపేతం ద్వారా ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసిన గ్రామ స్వరాజ్యాన్ని సాధించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో సోమవారం పంచాయితీ రాజ్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని సందేశం ఇచ్చారు. ఎంపీడీఓ వజ్ఞ శ్రీనివాసరావు. ఈఓ ఆర్డీ ఎన్ూ ప్రసన్నకుమార్లు మాట్లాడుతూ ఆర్టికల్ 73వ ఆర్టికల్ ద్వారా పంచాయితీలకు సర్వాధికారాలు వచ్చాయని సచివాయ వ్యవస్థ ద్వారా 11 రకాల సేవలు అందుబాటులోనికి వచ్చాయని అన్నారు. పలు రకాల సేవలలో ఉత్తమ ప్రతిభ చాటిన గ్రామ సర్పంచాలు, గ్రామకార్యదర్శులకు ప్రశాంశాపత్రాలు అందించారు. విఠలాపురం పంచాయితీకి ఏడు అవార్డులు, తురకపాలెం పంచాయితీకి ఆరు ఆవార్డులు. వెలుగు వారి పాలెం పంచాయితీకి ఐదు అవార్డులు, లక్కవరం పంచాయితికి నాలుగు అవార్డులు, మన్నేపల్లి పంచాయితీకి మూడు అవార్డులు, తూర్పు గంగవరం, మల్కాపురం పంచాయితీలకు ఒక్కటి చొప్పున అవార్డులు అందుకున్నారు. మిగిలిన పంచాయితీలు కూడ అవార్డులుపొందిన పంచాయితీలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వక్తలు కోరారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన స్వచ్ఛ దూత్లను సన్మానించారు. కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, తాళ్లూరు, బొద్దికూరపాడు, మల్కాపురం, మన్నేపల్లి, తూర్పుగంగవరం, వెలుగువారిపాలెం, తురకపాలెం, లక్కవరం, బెల్లం కొండ వారి పాలెం సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, మందా
శ్యామ్సన్, వలి, మంచాల వెంకటేశ్వర రెడ్డి, చాట్ల నాగమణి, ముచ్చుమారి కోటేశ్వరమ్మ, వరలక్ష్మి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామకార్యదర్శులు నూరుల్లా, బాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు పంచాయితీలలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచిల ఆధ్వర్యంలో ఉప సర్పంచిలు పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *