పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని తూర్పు గంగవరం సచివాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తూర్పు గంగవరం సర్పంచి చాట్ల నాగమణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ, బాబా సాహేబ్ అంబేడ్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛ దూత్ లకు ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చాట్ల ఇమ్మానియేల్, గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, వైసీపీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ, సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు.
