ముండ్లమూరు మండలం పులిపాడు పంచాయితీ పరిధిలోని బృందావనం
గ్రామంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశాలతో
ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నివాసానికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ఆ కుటుంబానికి జరిగిన మేళ్లును వివరించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంకి నేటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తేడా వివరించారు. వారిని పుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు అడిగి పూరించారు. వారి అనుమతితో నివాసానికి స్టిక్టర్ అంటించారు. 8296082960కి మిస్డ్ కాల్ ఇచ్చారు. కార్యక్రమంలో కుంటా అచ్చారావు , గూడూరు ఏసు , దాసరి చిన్న నాగేష్ , యెషయా కాటూరి , కుంటా మోష , గూడూరు పేరయ్య , కొదమల త్యాగరాజు, తాళ్లూరి శాంబయ్య , వైయస్సార్ సుబ్బయ్య మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు
