గ్రామాలలో దోమలపై అవగాహన కల్పించండి – ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహణ

గ్రామాలలో దోమల ఆవాసాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి నిర్మూలన తగిన చర్యలు తీసుకునే విధంగా ఆరోగ్యకార్యకర్తలు కృషి చెయ్యాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి కోరారు. స్థానిక పీహెచ్సీ పరధిలో మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి మాట్లాడుతూ… దోమల వలన విషజ్వరాలు సోకి గతంలో పడిన ఇబ్బందులను గమనించామని మరోసారి ఆ విధంగా కాకుండా చూడటానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో స్టాకు పాయింట్స్ లేకుండా చెయ్యాలని దోమ కుట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దోమల నివారణకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో దోమల నియంత్రణపై తీసుకోవలసిన చర్యల గురించి వివరిస్తూ ఆరోగ్యకార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీహెచ్ ఓ ప్రమీల, హెచ్ఎస్ఈఓ కె. శ్రీనివాసులు, హెల్త్ విజిటర్ కోటేశ్వరి, ల్యాబ్ టెక్నిషియన్ గోపి క్రిష్ణ, ఆరోగ్యకార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *