ఎయిమ్స్ అభయ మంత్లీ పెన్షన్ పథకం, పేదలకు మీరే సీఎం కావచ్చు అంటూ ఆల్ ఇండియా మహాత్మ సోషల్ క్లబ్స్ ఒంగోలు శాఖ ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిమ్స్ అభయ మంత్లీ పెన్షన్ పథకం రెండో విడత కార్యక్రమం స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఆదివారం అక్షయతృతీయ రోజున జరిగినది.
మార్చి నెలలో ఉగాది నాడు ప్రారంభించిన ఎయిమ్స్ అభయ మంత్లీ పథకం రెండో విడత రోజున మొత్తం పదిమంది పేదలకు తలా 500 చొప్పున పెన్షన్ ని అందించడం జరిగింది. ఈ పెన్షన్ తీసుకోవడానికి రాలేని మహిళా వృద్ధురాలు, కంటి చూపు సరిలేక వేదిక వద్దకు రాలేని పరిస్థితిని గమనించి మంగళవారం ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు అధ్యక్షులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు, క్లబ్ కోశాధికారి ధనిశెట్టి రాము నాయుడు ఆ మహిళా మూర్తి ఇంటికి వెళ్లి అభయ మంత్లీ పెన్షన్ అందించారు. కార్యక్రమంలో క్లబ్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రామణ గుప్తా జంధ్యం పాల్గొన్నారు.
ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ ఒకరికొకరు సహాయపడే విధముగా దాతల సహకారంతో నెలకు 500 రూపాయలను పేద లబ్ధిదారులకు దాతల చేతుల మీదుగ అందించడం జరుగుతుందని, వేదిక వద్దకు రాలేని వారికి ఇలా ఇంటికి వచ్చి అందించడం జరుగుతుందని తెలిపారు. పేదవారికి సహయపడడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
