శంకర జయంతి సందర్భంగా ఆది శంకరచార్య ట్రస్ట్ జాతీయ అధ్యక్షలు రాచకొండ శ్రీనివాస్, అధికార ప్రతినిధి కామరాజుగడ్డ కుసుమకుమారి ఆధ్వర్యంలో మంగళవారం లాయరపేటలోని ఆది శంకరుల విగ్రహానికి అభిషేకార్చనలు జరిపించారు. తీర్ధ ప్రసాదాలు పంచారు. ఈసందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలల తన పాదయాత్ర ద్వారా చాటి చెప్పిన మహనీయుడని, వారు భారతదేశం లో జన్మించటం మనం చేసుకున్న పుణ్యమని తెలిపారు. వారి జయంతిని అధికారికంగా జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మైనంపాటి సాయి కుమార్, సముద్రాల బీమశంకర శాస్త్రి, సాక్షి వెంకట సుజాత. కె. మారుతీ ప్రసన్న, రాము, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిశంకరులు జన్మించిన భారతదేశంలో జీవించడం మన సుకృతం – రాచకొండ శ్రీనివాస్.ఘనంగా శంకర జయంతి
25
Apr