గ్రామకార్యదర్శులు వేసవి కాలంలో ఆయా గ్రామాలలో నెలకొన్న ప్రత్యేక సమస్యలపై దృష్టి సారించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కోరారు. స్థానిక ఎంపీపీ ఛాంబర్లో బుధవారం గ్రామకార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామాలలో తాగు నీటి ఎద్దడిపై, వీధిలైట్లు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని ప్రజలు తీసుకువచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకుడు మా నమ్మకం నువ్వే జగనన్నపై సమీక్షించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీడీఓ వజ్జా శ్రీనివాసరావు, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచి వలి, ఈఓఆర్డీ ప్రసన్నకుమార్. గ్రామకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
26
Apr