ఇంటర్మీడియట్ ఫలితాలలో ముండ్లమూరు ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ పూర్ణ చంద్రరావు తెలిపారు.
మొదటి సంవత్సరం విద్యార్థులలో 51 మంది హాజరు కాగా 29 మంది ఉత్తీర్ణత సాధించినట్లు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80 మంది హాజరు కాగా 45 మంది ఉత్తీర్ణత సాధించిట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ప్రేమ్ చంద్ (964). ధనూష (957), వెంకట చందు (955) మార్కులు సాధించి తమ ప్రతిభ చాటినట్లు చెప్పారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్ , అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

