ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఒంగోలులోని శ్రీ హర్షిణి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ సత్తా చాటారు.
సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపిసి విభాగంలో ఇందుర్తి సాయి మానస ( 991) మార్కులతో జిల్లా మొదటి స్థానాన్ని సాధించింది, కె రేణుకా చౌదరి ( 988) మార్కులతో రెండో స్థానాన్ని, పులి అమృత (985 )మార్కులతో మూడో స్థానాన్ని సాధించారు. బైపిసి విభాగంలో వి భావన, వి స్రవంతి 981 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు. ఎంఈసి విభాగంలో షేక్ నాజియా (962 )మార్కులతో మొదటి స్థానాన్ని సాధించింది. 15 మంది 980 మార్కులకు పైగా సాధించారు. మరో 50 మంది 950 పైగా మార్కులు సాధించారు. 108 మంది 900 పైగా మార్కులు సాధించారు.
జూనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో కుంచాల మేఘన (463) మార్కులతో మొదటి స్థానాన్ని, చప్పిడి స్ఫూర్తి (461) మార్కులతో రెండో స్థానాన్ని, ఫిజి బేగం 460 మార్కులతో మూడో స్థానాన్ని సాధించారు, బైపిసి విభాగంలో ఆవుల అర్చన (4 22)మార్కులతో మొదటి స్థానాన్ని, డి ప్రియాంక (420) మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఎంఈసి విభాగంలో 461 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించింది. 450 మార్కులు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య 25, 400 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు సంఖ్య 96 మంది విద్యార్థులు ఉండటం విశేషం .
ఈ సందర్భంగా కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ అతి తక్కువ మంది విద్యార్థినులతో ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారకులైన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. కాలేజీ స్థాపించిన నాటి నుంచి అతి తక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులతో జిల్లా, రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సంవత్సరం నుంచి ఏడుగుండ్లపాడు వద్ద 13 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటర్మీడియట్ బాయ్స్ క్యాంపస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కరణం నారాయణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు.
