మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడాలి

మహిళలు స్వసక్తిగా అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో పోటీపడి అభివృద్ధి దిశగా పయనించాలని జన శిక్షణ సంస్థాన్ ప్రోగ్రాం అధికారి కే శ్యామ్ సునీల్ అన్నారు. మండలంలోని ఈదర గ్రామంలో నైపుణ్య అభివృద్ధి మరియు ఔత్సాహిక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ డ్రెస్ మేకింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఈదర గ్రామ సర్పంచ్ వంగల పద్మావతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యామ్ సునీల్ మాట్లాడుతూ శిక్షణ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అవకాశాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చందాలన్నారు. సర్పంచి పద్మావతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాక్షిక అక్షరాస్యులకు, గృహనీలకు శిక్షణ ద్వారా నైపుణ్యాలను తెలియజేసి వారు అభివృద్ధి దిశగా పొందేందుకు అవగాహన కల్పించాలన్నారు. దళిత రిసోర్స్ సెంటర్ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడాలన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపనబోయిన వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ మహిళలకు ప్రత్యేకించి ప్రభుత్వం అనేక రకాల శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలపై అభివృద్ధి పరిచి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ లీడర్ కాలువ సువర్ణ రాజు, ఎం సుశీల, రమేష్, జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *