చిన నాటి నుండే చిరుధాన్యాలపై అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థులు చిన నాటి నుండే చిరుధాన్యాలపై అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. స్థానిక ఎబీసీ ఉన్నత పాఠశాలలో గురువారం కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు చిరుధాన్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… చిననాటి నుండే సరియైన అహారం తిని ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయ్యాలని చెప్పారు. ప్రతి ఒక్క నివాసంలో చిరుధాన్యాలను సాగు చేసి చిరుధాన్యాలను తప్పనిసరిగా ఆహారంలో బాగంగాచేసుకోవాలని చెప్పారు. స్పైసీ ఫుడ్ వలన కలిగే అనర్థాలను వివరించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారం తగిన నీరు తీసుకోవటం వలన విద్యార్థులు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తగిన సూచనలు చేసారు. కార్యక్రమంలో డైరెక్టర్ కాలేషాబాబు, ఎఈఓ నాగరాజు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *