విఠలాపురం కాలనీలో మారం సుబ్బారావు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణతో భక్తులు తరించారు. అన్నదానం నిర్వహించారు.
