సత్యవేడు కల్యాణ మండపాలకు శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి

తిరుపతి జిల్లా సత్యవేడులో రెండు కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించే కళ్యాణమండపం భూమి పూజ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు… స్థానికంగా బేరి శెట్టి కళ్యాణ్ మండపం సమీపంలో ఒక ఎకరా ప్రభుత్వ భూమి లో ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి టిటిడి అనుమతి ఇవ్వడంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత ఎంపీ బై ఎలక్షన్ లో సత్య వేడు కు నేను ఇన్చార్జిగా ఉన్నప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇక్కడ టిటిడి కళ్యాణ మండపం నిర్మాణం ఆవశ్యకత ఎంత ఉందో వివరించారని అప్పుడే తాను ప్రజల సమక్షంలో సత్యవేడులో టిటిడి కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి పూర్తిగా కృషి చేస్తామని మాట ఇచ్చామని ఈ కళ్యాణంలో ఒక మంజూరుకు సీఎం జగన్ వెంటనే అనుమతులు ఇవ్వడం తో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుగుతోందని.. సత్యవేడు నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అని అదే విధంగా సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గమని ఇక్కడ అందరూ దాదాపుగా బడుగు బలహీన వర్గాల వారే అధికమని ఇక్కడ ఓ కళ్యాణ మండపం చాలా అవసరమని ఇప్పుడున్న పరిస్థితుల్లో కళ్యాణ మండపాలలో లక్షలకు లక్షలు చెల్లించి పెళ్లిళ్లు జరుపుకోవడం సామాన్యుడి కి స్తోమతకు మించిన భారమని దీనిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమండపం నిర్మాణం చేపట్టి సామాన్యులు బడుగు బలహీన వర్గాల వారు వారి కుటుంబాలలోని పెళ్లిలను జరుపుకునే విధంగా ప్రభుత్వం కృషిచేసిన విషయాన్ని సత్యవేడు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని.. అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా దాసు కుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణానికి నోచుకోకుండా ఉండడం దాన్ని కూడా ఎమ్మెల్యే ఆదిమూలం సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి ఏకంగా 27 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం శుభపరిణామము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *