ముండ్లమూరు మండలం లో స్వయం సహాయక సంఘాలలో లేనివారిని గుర్తించి వారిని గ్రూపులో చేర్పించే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏరియా కోఆర్డినేటర్ వసుంధరా దేవి అన్నారు. స్థానిక వైకెపి కార్యాలయంలో గురువారం మండల సమాఖ్య అధ్యక్షురాలు తిరుపతమ్మ అధ్యక్షతన వివోఎలా సమావేశం జరిగింది. వసుంధరా దేవి మాట్లాడుతూ ప్రాజెక్టులో జరుగుతున్న అన్ని కార్యక్రమాలైనా స్త్రీనిధి, సిఐఎఫ్, వి ఆర్ ఎఫ్, ఐడబ్ల్యూ ఎంపీ, ద్వారా తీసుకున్న రుణాలను 100% తిరిగి చెల్లించాలన్నారు. మొబైల్ బుక్ కీపింగ్ లో 100% నమోదు చేయాలని సూచించారు. లక్ దీదీ సర్వే నూరు శాతం చేయాలన్నారు. ఆజాది అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి గ్రూపుల లో లేని వారిని గుర్తించి వారిని గ్రూపుల్లో చేర్పించాలన్నారు. ప్రత్యేకంగా ఎస్టీలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి మేనేజర్ పవన్ కుమార్ , సీసీ మోహనరావు , గురవయ్య, సిహెచ్ డేవిడ్, అకౌంటెంట్ గోపన బోయిన మార్తమ్మ , తదితరులు పాల్గొన్నారు.
గ్రూపులలో లేని వారిని గుర్తించి గ్రూపులలోచేర్పించాలి
28
Apr