బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వక్తలు అన్నారు. దర్శి పట్టణంలో తూర్పు చౌట పాలెం రోడ్లో శుక్రవారం మోడిని గద్దె దించండి- దేశాన్ని కాపాడండీ అంటూ సీపీఐ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రచార భేరీలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశంలో పీఎం నరేంద్ర మోడీ కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, అనుసరిస్తున్న విధానాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. ఎల్ నారాయణ ఆరోపించారు. సీపీఎం, సీపీఎం కార్యవర్గ సభ్యులు జీవీ కొండా రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ వెంకట రావు, కంకణాల ఆంజనేయులు నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తాండవ రంగారావు, జూపల్లి కోటేశ్వరరావు, ఎస్ వెంకేటేశ్వరరావు, వెల్లంపల్లి ఆంజనేయులు, కొటంశెట్టి హనుమంతరావు, అంజయ్య, కరుణానిధి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణకు అడ్డుకోవాలి – దేశాన్ని కాపాడు కుందాం సీపీఐ- సీపీఎం బహిరంగ సభ నిర్వహణ
28
Apr