ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ భాత్ ఈనెల 30న వందవ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని బిజేపి శ్రేణులు విజయవంతం చెయ్యాలని బిజేపి దర్శి అసెంబ్లీ కన్వినర్ మాపపాకుల శ్రీనివాసులు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజక వర్గంలోని అన్ని మండలాలో శక్తి కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేసి జయప్రదం చెయ్యాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తీర్మానించారు. పట్టణ అధ్యక్షుడు గురు అర్జునరావు, బచ్చు అనిల్, నాగభూషణ చారి , బచ్చు నరసింహారావు , అచ్యుత శరత్, వంకదారి కుమార్ ఎలుకొండయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పీఎం వందవ మనీకీ బాత్ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలి
28
Apr