భారీ చోరీ కేసును చాక చక్యంగా ఛేదించిన ప్రకాశం జిల్లా పోలీసులు- అంతర జిల్లా దొంగలను స్వల్ప వ్యవధిలో అరెస్ట్ చేసిన పోలీసులు – అభినందించిన జిల్లా ఎస్పీ మలిక గర్గ్ – రూ. 43.50 లక్షల విలువైన 92.75 సవర్ల బంగారం, ఐకేజీల వెండీ రికవరీ

ప్రకాశం జిల్లా పోలీసులు ఎంతో చాక చక్యంగా వ్యవహరించి భారీ చోరీ కేసును ఛేదించారు. తక్కువ వ్యవధిలో భారీ చోరీ కేసును ఛేదించి అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి భారీ సొత్తును రికవరీ చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ మలిక గర్ల్ అభినందించారు. ఒంగోలులో జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మలిక గర్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు | మండలం, తాళ్లూరులో రామాలయం ప్రక్కన 2023 మార్చి 7న చందోలు శ్రీనివాసరావు నివాసంలో భారీ చోరీ జరిగింది. ఫిర్యాదు అందుకున్న తాళ్లూరు ఎస్సై ప్రేమకుమార్ కేసు నమోదు చేసారు. దర్శి డీఎస్పీ నాగేశ్వర రెడ్డి, సీఐ రామకోటయ్యల ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఎస్పీ మలిక గర్ల్ ప్రత్యేక దృష్టి సారించి కేవలం 40 రోజులలో కేసును ఛేదించటం ప్రత్యేకత సంతరించుకున్నది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముద్దాయిల పేర్లు:

  1. వనపర్తి రాజు @ శివ స్వగ్రామము జంగారెడ్డిగూడెం గ్రామం & మండలం, వెస్ట్ గోదావరి జిల్లా ప్రస్తుతము దేనువకొండ గ్రామము అద్దంకి మండలం. [మొత్తం 17 కేసులు నమోదు అయినాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి]
  2. చలంచర్ల మల్లికార్జున, తేటిపేట గ్రామము, పొన్నలూరు మండలము. [A1, A2 షడ్గుల్లు]
  3. చలంచర్ల ఆంజనేయులు తేటిపేట గ్రామము, రావులకొల్లు పంచాయతి, పొన్నలూరు మండలము. [A2 తండ్రి]
  4. చలంచర్ల చెంచయ్య తేటిపేట గ్రామము, రావులకొల్లు పంచాయతి, పొన్నలూరు మండలము. [A2 తమ్ముడు]
  5. కొమరగిరి పేరయ్య, దేనువకొండ గ్రామము, అద్దంకి మండలము. [A1 బావ మరిది]

నేరం జరిగిన తీరు:- వనపర్తి రాజు @ శివ చిన్న తనములోనే తన తలిదండ్రులు చనిపోవడముతో మద్యం, పేకాట వంటి వ్యసనాలకు అలవాటుపడి వాటి కోసం డబ్బులు అవసరము అయినప్పుడల్లా రాత్రిపూట దొంగతనాలు చేస్తూ వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ వున్నట్లు, ఈ క్రమములో వనపర్తి రాజు @ శివ అను అతని పైన దేవరపల్లి, చౌడవరం విజయనగరం జిల్లాలోని సాలూరు, రాంభద్రాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి, నరసన్న పేట, తనుకు, తుని, పోలీస్ స్టేషన్ల పరిదిలో రాత్రి పూట తాళము వేసిన ఇళ్ళలో దొంగతనములు చేయగా చివరగా మొదటిసారిగా సాలూరు పోలీస్ వారు అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. జైలు నుండి వచ్చిన తరువాత వనపర్తి రాజు చెన్నై వెళ్లి కూలిపనులు చేస్తూ అక్కడ చల్లపల్లి మల్లికార్జున అక్క అయిన నాగమణి పరిచయమైనది, సదరు నాగమణి, వనపర్తి రాజు @ శివ కు దేనువకొండ గ్రామము, అద్దంకి మండలము నివాసి అయిన నందిని ఇచ్చి వివాహము చేయగా అప్పటి నుండి వనపర్తి రాజు @ శివ దేనువకొండ గ్రామములో వుంటూ చిన్న, చిన్న కూలి పనులు చేసుకొంటూ వున్నాడు. ఈ క్రమములో 2020 లో లాక్ డౌన్ కారణము గా చేతిలో పనులు లేక, జల్సాలకు ఖర్చులకు డబ్బులు లేక ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశముతో పై మిగిలిన ముద్దాయి లతో కలిసి ఇంకొల్లు, కందుకూరు రూరల్, కొరిసపాడు, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో 8 తాళములు వేసిన ఇళ్ళల్లో దొంగతనము చేసినారు. ఇంకొల్లు లో దొంగలించిన సొత్తుతో AP 5BN2788 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కార్ కొని తదుపరి చేసిన నేరములకు సదరు కార్ లో వెళ్లి దొంగతనములు చేసి తిరిగి వెళ్ళిపోయేవారు. దొంగలించిన సొమ్ములో కొంత సొమ్ము మనప్పురం, ముతూట్ వంటి ఫైనాన్ కంపెనీ లలో మరియు పొన్నలూరు యూనియన్ బ్యాంకు లో తనక పెట్టి డబ్బులు తీసుకొని జల్సాలు చేసేవారు.

దర్యాప్తు విధానం, కేసు చేధింపు: ఈ చోరీ కేసుని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ సవాలుగా తీసుకొని కేసుని ఛేదించడానికి అడిషనల్ SP (క్రైమ్) శ్రీధర్ రావు మరియు దర్శి DSP పర్యవేక్షణలో దర్శి CI, తాళ్లూరు SI, ముండ్లమూరు SI మరియు వారి సిబ్బందితో ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చెయ్యగా ఈ టీం అన్ని కోణాలలో సమగ్ర దర్యాప్తు చేసి, తాళ్లూరు మండలం, శివరాంపురం శివార్లలోని NSP కాలువ వద్ద తేదీ: 28.04.2023 న ముద్దాయిలను అరెస్ట్ చేసి చోరీ చేసిన సొత్తులో Rs.43,50,000/- మరియు రూ 2,50,000 విలువ గల AP 5BN 2788 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కార్ ను స్వాధీన పరుచుకొన్నారు.

రికవరీ సొత్తు:- 1). ముద్దాయిల వద్ద నుండి 742 గ్రాముల [430+312] [92.75] సవర్లు బంగారం. విలువ.Rs. 40,00,000/-రూపాయలు 2). 5 kgs వెండి, Rs.3,50,000/- మొత్తం విలువ. Rs.43,50,000/-

సీజ్ చేసిన ప్రాపర్టీ:- 1]. AP 5BN 2788 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కార్, 2]. IZOM కంపెనీ డ్రిల్లింగ్ మెషిన్, 3]. గడ్డపార 4]. స్క్రూ డ్రైవర్, 5].సెల్ ఫోన్స్ -2, 6]. బ్యాంక్స్ తనఖా రశీదులు-6.

రికవరీ పెండింగ్ :- [ప్రైవేటు మరియు govt.బ్యాంక్స్ లలో]:- 312 గ్రాములు:
1]. ముత్తుట్ ఫైనాన్సు – కందుకూరు బ్రాంచ్ నందు రెండు లోన్ అమౌంట్ తాలుక బంగారం 35 గ్రాములు, 2]. మన్నప్పరం ఫైనాన్సు – కందుకూరు బ్రాంచ్ నందు లోన్ అమౌంట్ తాలుక బంగారం 33.530 గ్రాములు 3]. ముత్తుట్ ఫిన్ కార్ప్ ఫైనాన్సు కందుకూరు బ్రాంచ్ నందు రెండు లోన్ అమౌంట్ తాలుక బంగారం 49 గ్రాములు 4]. యూనియన్ బ్యాంకు – పొన్నలూరు బ్రాంచ్ నందు లోన్ అమౌంట్ తాలుక బంగారం 61 గ్రాములు 5]. యూనియన్ బ్యాంకు – పొన్నలూరు బ్రాంచ్ నందు లోన్ అమౌంట్ తాలుక బంగారం.90 గ్రాములు 6]. యూనియన్ బ్యాంకు – పొన్నలూరు బ్రాంచ్ నందు లోన్ అమౌంట్ తాలుక బంగారం.44 గ్రాములు.

ఈ దొంగతనం కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన దర్శి SDPO V. నారాయణస్వామి రెడ్డి, దర్శి CI J.రామకోటయ్య, తాళ్లూరు SI బి. ప్రేమ్ కుమార్, ముండ్లమూరు SI L.సంపత్ కుమార్, ASI G.మోహన్ రావు, కానిస్టేబుళ్లు, విజయ్, శేషగిరి, రాములు, బ్రహ్మనాయుడు, హోం గార్డ్ వెంకట రెడ్డి లను ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలు మరియు రివార్డ్స్ ను SP గారు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *