డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకంతో రైతులకు మంచి మేలు చేకూరుతుందని వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. మండలంలోని మల్కాపురం, రాజానగరం గ్రామాల పరిధిలో రైతు మిత్ర గ్రూపులకు కమ్యునిటి హైరింగ్ కేంద్రాల ద్వారా గొర్రులు, నాగళ్లు, ధైవాన్ స్పేయర్లు పంపిణీ చేసారు. గ్రూపునకు రూ. 15.04 లక్షల విలువైన 20 నాగళ్లు, 15 గొర్రులు, 5 దైవాన్ స్పేయర్లు అందించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతన్నలకు అన్ని విధానాలుగా మేలు చేకూరాయని అన్నారు. సర్పంచి షేక్ వలి, ఎంపీటీసీ ఎం. వెంకట రామి రెడ్డి, విఏఏ అశోక్, వెంకటేశ్వర రెడ్డి, విఆర్డీఓ నారప రెడ్డి. గ్రామకార్యదర్శి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

