జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజక వర్గంలోని దివ్యాంగులకు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మరియు జిల్లా వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో ఉచితంగా దివ్యాంగులకు అవసరమైన ఊత సామగ్రిని అందజేయనున్నట్లు వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతి రెడ్డి గోపాల్ రెడ్డి తెలిపారు. దర్శిలో భవిత్ కేంద్రంలో దివ్యాంగుల కేంద్రంను శనివారం సందర్శించారు. ఐఈడీ గోపాలుని సుబ్రమణ్యంతో కలసి విద్యార్థి తనుశ్రీ నివాసానికి వెళ్లి ఇంటి వద్ద విద్యను పరిశీలించారు. మేల 26వ తేదీని మార్కాపురంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో వర్చువ్ పాండేషన్, శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం సంయుక్తంగా ప్రత్యేక శిబిరం నిర్వహించి దివ్యాంగులకు వినికిడి, శారీరిక బ్లయిండ్ స్టిక్స్ వంటి పరికరాలు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. దివ్యాంగులు వారి సదరన్, ఆధార్, రెండు ఫోటోలలతో నమోదు చేసుకోవాలని కోరారు . ప్రోగ్రాం నిర్వహించు తేదీనకు 5 రోజులు ముందుగా ఈ నెంబర్ నకు ఫోన్ చేసి 7382912753 పేర్లు నమోదు చేసుకోవలెను. ముందుగా తాము నిర్వహిస్తున్న శిబిరం గురించి దర్శిలో వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి శ్రీధర్ తో కలసి చర్చించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గామిమూటి దేవ ప్రసాద్ లు పాల్గొన్నారు.
