అకాల వర్షం ఆదివారం కురవటంతో రైతన్నలు, ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు. కోత మీద ఉన్న వరి, ధాన్యం, మొక్కజొన్న, కళ్లాలలో ఉన్న పంటలు రైతులు వాటిని కాపాడుకునేందుకు పరుగులు తీసారు. దర్శి పట్టణంలో ప్రధాన వీధులు జలమయం అయ్యాయి. పలు కాలనీలలో నీరు నిలిచి పోవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దర్శి, పొదిలి ప్రధాన రహదారిలో చిన కాటేరు వాగు పొంగటంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగినది. చిన్న కార్లు సైతం నీటి ప్రవాహంలో పోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గడియారం స్తంభం ప్రాంతం జలమయం అయినది. బొట్ల పాలెం తిరునాళ్లకు ఏర్పాటు చేసిన ప్రభలకు సైతం వర్షంతో ఏమి చెయ్యాలేని పరిస్థితిలో నిర్వాహకులు ఉన్నారు.

