ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాలలో గల శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాల్లో ఆరాధన ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రమైన ముండ్లమూరు లో బ్రహ్మంగారి చెట్టు, మెయిన్ రోడ్ల లో గల బ్రహ్మంగారి దేవాలయం తోపాటు, ఉల్లగల్లు, తమ్మలూరు, పోలవరం, వేంపాడు, మారెళ్ళ, ఉమామహేశ్వరపురం, భీమవరం, తదితర గ్రామాలలో గ్రామస్తులు ఐక్యంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారి దేవాలయంలో దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ గోవిందమాంబ, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి రథం ఊరేగింపు కార్యక్రమంలో చిన్నారులు , పెద్దలు, యువకులు, ఊరేగింపులో పాల్గొన్నారు.
ముండ్లమూరు మండలంలో భక్తిశ్రద్ధలతో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు
30
Apr