ప్రకాశం జిల్లాలో అకాల వర్షం ఆదివారం కురవటంతో రైతన్నలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనకల మిట్ల మండలంలోని ఇరసలగుండం గ్రామంలో పిడుగు పాటుకు గురై .. రాచమల్ల చిన్న చెన్న రెడ్డి గారికి చెందిన 15 గొర్రెలు చనిపోవడం జరిగింది.. ఆదేవిధము గా .. ముండ్లమూరు మండలం ఉల్లగల్లు సమీప పొలాల్లో పడిన పిడుగు…ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో పిడుగు పడడంతో తప్పిన పెను ప్రమాదం…
దర్శి మండలం తానంచింతలకు చెందిన కత్తి సుబ్బారావుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు గురై ఆదివారం మృతి చెందినది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లిన సుబ్బారావు వర్షం సమయంలో తన ఎద్దులకు ఒక చెట్టు క్రింద కట్టివేసి తనొక చెట్టుక్రిందకు వెళ్లాడు. తర్వాత పిడుగు పడి ఒక ఎద్దు మృతి చెందినది. మృతి చెందిన ఎద్దు విలువ రూ. 60వేల వరకు ఉంటుందని బాధిత రైతు బంధువులు తెలిపారు.
