తాళ్లూరు మండలంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తూర్పుగంగవరంలో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కేక్‌ను కట్ చేసి మేడే ప్రాముఖ్యతను వివరించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచిలు చాట్ల నాగమణి, వలి. సుబ్బారావు, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచి కాశి రెడ్డి. నాయకులు చాట్ల ఇమ్మానియేలు, చందన, పూనూరి దేవదానం. యూనియన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్, ఉపాధ్యక్షుడు జాష్టిగిరిబాబు, యూనియన్ బాధ్యులు పాల్గొన్నారు.
తాళ్లూరు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోడపాటి హనుమంతరావు, రామారావు. బాల కోటయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



