దర్శి నియోజక వర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ, డీవైఎఫ్ఎస్ఐ, సీపీఎం, ఎలసీ, ఆశా, సివిల్ సప్లై, ముఠా, మధ్యాహ్నభోజనం, స్వచ్ఛభారత్, బిల్డింగ్ కార్మికులు ఎఐటీమూసీల ఆధ్వర్యంలో పలు చోట్ల మేడే జెండాను ఆవిష్కరించారు ప్రదర్శనలు నిర్వహించారు. వక్తలు మేడే ప్రాముఖ్యతను, ప్రవేటీ కరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆయా కార్యక్రమాలలో తాండవ రంగరావు, గోగు వెంకయ్య, ఆర్ రామకోటిరెడ్డి, షేక్ కాలేభాష, జాలా సుశీల, కేవి పిచ్చయ్య, కోటంశెట్టి హనుమంతరావు, జూపల్లి కోటేశ్వరరావు, ఆర్ కరుణానిధి, తదితరులు పాల్గొన్నారు. ఆర్ డబ్ల్యుఎస్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర దళిత సేన నియోజక వర్గ కార్యదర్శి జి. ప్రేమకుమార్, గట్టు పల్లి ప్రసాద్. నాగమణి తదితరులు పాల్గొన్నారు.
దర్శి పట్టణంలో పలు చోట్ల ఘనంగా మేడే వేడుకలు
01
May