భూముల రీ సర్వేలో భాగంగా పెండింగ్ లో ఉన్న భూముల పరిష్కారంలో తేడాలు వస్తే సహించేది లేదని తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ తెలిపారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వీఆర్వోలు ,విలేజ్ సర్వేయర్లతో భూముల రీసర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 12 గ్రామాల్లో డ్రోన్ కెమెరా ద్వారా తీసిన భూముల ఛాయ చిత్రాలు వచ్చాయని, వాటి ద్వారా భూముల వివరాలు తెలుసుకొని రెండు సమానంగా ఉంటేనే వారికి తెలియజేసి సమస్యను పరిష్కరించాలన్నారు. అలా లేనియెడల ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. భూముల సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే పెండింగ్లో పెట్టాలన్నారు. తద్వారా గ్రామాల్లో గ్రామసభ ఏర్పాటు చేసి భూముల యజమానులను పిలిపించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. రీ సర్వేలో తేడాలు వస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్, సీనియర్ అసిస్టెంట్ పోగుల శేషగిరిరావు, మండల సర్వేయర్ శివ ప్రసాద్, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
రీసర్వేలో తేడాలు వస్తే సహించేది లేదు
01
May