ఏ రంగంలోనైనా శ్రామిక శక్తి లేకపోతే ప్రగతేలేదని సిపిఐ మండల కార్యదర్శి సుంకర అంజిరెడ్డి అన్నారు. మండలంలోని మారెళ్ళ గ్రామంలో మట్టా శర భారెడ్డి సిపిఐ భవనం నందు సోమవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ గౌరవ అధ్యక్షురాలు మట్టా మహాలక్షమ్మ సిపిఐ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా సుంకర అంజి రెడ్డి మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం దశాబ్దాలపాటు రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. కార్మికులకు వెన్నంటి ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న సిపిఐ ని మరింత బలోపేతం చేయాలన్నారు. అసంఘటిత కార్మికుల హక్కుల సాధనకు ఐకమత్యంగా ఉండి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందుగా జండా ఆవిష్కరణ చేసి , జండా వందనం స్వీకరించి, మేడే వర్థిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, అమరవీరులకు లాల్ సలాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మారళ్ళ గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రిబోయిన కోటయ్య, సుంకర అంజిరెడ్డి, కొణిదెన రాధాకృష్ణ, సుంకర అంజిరెడ్డి, బుర్రి గోవిందరాజులు, సుంకర భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రామిక శక్తి లేకపోతే ప్రగతే లేదు
01
May