దర్శి మండలంలోని పాఠశాలల్లో జరుగుతున్న నా – నేడు పనులు మే
నెలాఖరు లోపు ఎట్టి పరిస్థితులలో పూర్తి చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి రఘరామయ్య కోరారు. దర్శి ఎంఆర్సీ కార్యాలయంలో బుధవారం నాడు- నేడు పనులపై ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో మొత్తం 39 పాఠశాలల్లో నాడు – నేడు పనులు జరుగుతున్నట్లు ఆయా పాఠశాలలో వివిధ దశల్లో ఉన్న పనులు పూర్తి చెయ్యాల్సి ఉందని ఎఈ జగదీశ్వరరావు చెప్పారు. ప్రతి రోజు పనులపై తగిన శ్రద్ధ తీసుకుని పూర్తి అయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.
నాడు- నేడు పనులపై సమీక్ష – మే నెలాఖరుకు పూర్తి చెయ్యాలి – ఎంఈఓ రఘరామయ్య
03
May