సొంత పొలంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికొ స్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పిన ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడింది. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామ సమీపంలో ఈదర వాగులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మక్కెన వారిపాలెం గ్రామానికి చెందిన చావా వెంకటేశ్వర్లు భార్య హైమవతి (44), తల్లి ద్రాక్షాయమ్మతో కలిసి ట్రాక్టర్పై పొలానికి వెళ్లారు. వ్యవసాయ పనులు ముగిం చుకుని ఇంటికి వస్తుండగా ఈదర వాగులో ఎగమోరు ఎక్కుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. హైమవతి అక్కడికక్కడే మృతి చెందగా, వెంక టేశ్వర్లు, ద్రాక్షాయమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ వినుకొం డలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సం పత్ కుమార్ తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి
05
May