తాళ్లూరు మండలం లక్కవరం అడ్డరోడ్డు వద్ద గురువారం రాత్రి ఓ ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలలోనికి వెళితే… దర్శి నగర పంచా యతీ పరిధిలోని శివరాజ్నగర్కు చెందిన అంకాల వెంకటేశ్వర్లు, నాగమ్మలు చీమకుర్తిలో పనులు ముగించుకొని తిరిగి శివరాజనగర్కు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. లక్కవరం అడ్డరోడ్డు సమీపంలో కాజ్వే పైకి రాగానే తూర్పుగం గవరం వైపునకు వేగంగా వస్తున్న ఇన్నోవా వాహనం ద్విచక్ర వాహనాన్ని ట్టింది. దీంతో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. నాగమ్మకు స్వల్ప గాయా లయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ వాహన సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథ మిక చికిత్సలు చేసిన తర్వాత చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
05
May