పోలీసులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి అభినందనలు – భారీ రికవరీ చేసినందుకు ఎస్సైలను అభినందించిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లాలో జరిగిన పలు దొంగతనాల కేసులు ప్రత్యేకించి దర్శినియోజక వర్గంలో జరిగిన భారీ చోరీ కేసులను తక్కువ కాల వ్యవధిలోపరిష్కరించి ప్రజల సొమ్మును రికవరీ చేసిన పోలీసులను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ శుక్రవారం అభినందించారు. మాధవరంలో ఓకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనటానికి వచ్చిన ఎమ్మెల్యే తాళ్లూరు,ముండ్లమూరు ఎస్సైలు ప్రేమ్కుమార్, సంపత్కుమార్లను చూసి భారీ కేసుఛేదనలో డీఎస్సీ నారాయణ స్వామి రెడ్డి, సీఐ రామకోటయ్యలతో పాటుఎస్సైలు, తోటి సిబ్బంది కష్టపడి త్వరగా ఛేదించారని చెప్పారు. ప్రజలకున్యాయం జరిగేలా చూసినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సొమ్మును త్వరగా వారికి అందేలా చూడాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *