ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకులు బిజ్జం శివారెడ్డి లక్ష్మి దంపతుల కుమార్తెలు వర్ధికారెడ్డి, లాస్యరెడ్డిల ఓ నీల ఫంక్షన్ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు హాజరైనారు. శుక్రవారం గ్రామంలో జరిగే ఓణీల ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించి, అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎం భాష, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచి చింతా శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, ఆంజనేయ డైరీ ఎండి ఎనుముల శ్రీనివాసరెడ్డి, గూడాల లింగారెడ్డి, గూడాల సుబ్బారెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి. పాలడుగు (మిలటరీ) చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

