దొనకొండ మండలంలోని గంగదేవిపల్లిలో మాజీ సర్పంచ్ కర్నాటి సునీతా ప్రసన్నాంజనేయరెడ్డి గృహ ప్రవేశానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి శుక్రవారం హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు పూలు చల్లుతూ వారికి మేళతాళాలతో టపాసులు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. వారి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణా రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




