తాళ్లూరు మండలంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు 69.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ జి. సుబ్బయ్య తెలిపారు. అందులో ప్రభుత్వ, జెడ్పీ, కెజిబివి ఉన్నత పాఠశాలల్లో 370మంది విద్యార్థులు హాజరు కాగా 188 మంది ఉత్తీర్ణులై. 50.27శాతం సాధించగా, జెడ్పీ ఉన్నత పాఠశాల లక్కవరంలో అధ్యధికంగా 68.5శాతం ఉత్తీర్ణత సాధించగా, వికే ఉన్నత పాఠశాలలో 28.21 శాతం మందివిద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 90.17శాతం సాధించినట్లు చెప్పారు. శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో 120 మంది పరీక్షలకు హాజరు కాగా 105 మంది ఉత్తీర్నుల సాధించగా అందులో ఆవుల లక్ష్మి శివకుమారి (587) మార్కులు సాధించి మండలంలో ప్రధమస్థానంలో నిలిచింది. గంగా హైస్కూల్‌కు చెందిన 46 మంది పరీక్షలకు హాజరు కాగా 38 మంది ఉత్తీర్నులు కాగా సీహెచ్ భీమేశ్వరి (584) మార్కులు సాధించి మండలంలో ద్వితీయ స్థానంలో, గీతాంజలి హైస్కూల్‌కు చెందిన 43 మంది పరీక్షలకు హాజరు కాగా 38 మంది ఉత్తీర్ణులు కాగా అందులో కె. వెంకట రెడ్డి (583) తృతీయ స్థానంనలో, ఎబీసీ హైస్కూల్‌కు చెందిన 43 మంది విద్యార్థులలో 42 మంది విద్యార్థులు ఉత్తీర్నులు కాగా తంగిరాల నిర్మలా నివేదిత (582), చందన (581), ప్రసన్నాంజనేయులు (580) మార్కులు సాధించారు. జాహ్నవి హైస్కూల్లో 34 మందికి గాను 34 మంది ఉత్తీర్ను లై నూరు శాతం సాధించి, ఎన్ యోగిలత (581) సాధించినది. శారద హైస్కూల్‌కు చెందిన 33మంది పరీక్షలకు హాజరు కాగా, 31 మంది ఉత్తీర్నులు కాగా ఎం. స్రవంతి (582) మార్కులు సాధించినది. అమెరికల్ పబ్లిక్ స్కూల్లో 9 మందికి గాను, తొమ్మిది మంది పాస్ అయి నూరుశాతం సాధించారు. ప్రగతి హైస్కూల్‌కు చెందిన చెందిన 18 మందికి గాను 16 మంది పాస్ అయినారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
తాళ్లూరు మండలంలో 69.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
06
May