వైద్యఆరోగ్య శాఖలో ఉన్న పలు శాఖపరమైన సమస్యలు పరిష్కరించాలని యునైటెట్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు కోరారు. తూర్పు గంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తనిఖీకి విచ్చేసిన ఆశాఖ రాష్ట్ర పిన్సిపల్ సెక్రటరి ఎంటి క్రిష్ణబాబును కలిసిన సంఘ నాయకులు పలు సమస్యలు విన్నవించారు. ‘2211 హెడ్ వారి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ బదిలీలు గురించి తెలిపారు. వేతనాలు ఎటువంటి సమస్య లేకుండా అందేలా చూస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు షేక్ మస్తానమ్మ, శిల్ప, కోటేశ్వరరావు తదితరులు తెలిపారు.
శాఖ పరమైన సమస్యలు పరిష్కారించాలని క్రిష్ణబాబుకు వినతి
06
May