మిర్చి రైతులను ఆదుకోవాలిమండల టిడిపి అధ్యక్షులు కూరపాటి

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మిరప రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని పూరిమెట్ల ,ఉమామహేశ్వరపురం, గ్రామాల్లో శనివారం మిర్చి రైతులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రైతులు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో రైతులు నష్టాలు ఊబిలో కూరుకు పోయారన్నారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తక్షణమే రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక ఎకరాకు 30 వేల రూపాయలు చొప్పున చొప్పున నష్టపరిహారం అంద చేయాలని తెలిపారు. డిమాండ్స్- పంట నష్టం అంచనా వేసి త్వరిత గతిన పరిహారం అందించాలి, అకాల వర్షాలకు దెబ్బతిన్న రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి, రబీ దానం కొనుగోలు వేగవంతం చేయాలి, నాణ్యత కోల్పోయిన వివిధ రకాల పంటలను కొనుగోలు చేయాలి, నష్టపోయిన వరి మొక్కజొన్న రైతులు ఎకరాకు 30000 చొప్పున పరిహారం అందజేయాలి, మిర్చి ,అరటి, మామిడి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు పరిహారం అందజేయాలి, రాయితీపై విత్తనాలు అందజేసి రైతులను ఆదుకోవాలి, పిడుగుపాటు గురై మరణించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షల పరిహారం అందజేయాలి. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వరగాని పౌలు, కొక్కెర నాగరాజు, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి, కూరపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *