దర్శి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు, గ్రామాలలో తాగు నీటి సమస్య లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధికారులను ఆదేశించారు. దర్శి మండల సర్వసభ్యసమావేశం శనివారం సమావేశ మందిరంలో ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బ్లూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ……. దర్శి మండల అభివృద్ధి కి జిల్లా పరిషత్ నిధుల నుండి ఇప్పటిదాకా కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగినదని అన్నారు . మంజూరు చేసిన పనుల్లో అనేక పనులు పూర్తి అయినవి ఇంకా పనులు స్టార్ట్ చేయనివి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు .
కొత్తపల్లి,లక్ష్మి పురం కు మంచి నీటి సమస్య వుంది అని సర్పంచ్ తెలిపారు జిల్లా అధికారులకు చెప్పి వెంటనే ఆ గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ చెప్పారు .లక్ష్మి పురం లో ఇప్పటికే వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగినదని ,
వేసవి దృష్ట్యా ప్రతి గ్రామములో మంచి నీటి సమస్య లేకుండా చేయాలని అధికారులను కోరారు .మీకు మంచి నీటి సమస్య కోసం నిధులు కావాలి అంటే జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు .
వేసవి దృష్ట్యా కరెంట్ సమస్య లేకుండా అధికారులు చూసుకోవాలని కోరారు .
దర్శి మండలం లోని అన్ని గ్రామాల సర్పంచ్ లకు,ఎంపిటిసి లకు మీ గ్రామాల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను అని , ప్రతిపాదనలు తీసుకొని రావాల్సిందిగా కోరారు .
తూర్పు చౌటపాలెం జిల్లా పరిషత్ స్కూల్ లెవెలింగ్ అడిగియున్నరని , త్వరలో స్కూల్ సందర్శించి నిధులు మంజూరు చేస్తా అని హామీ ఇస్తున్నానని తెలిపారు అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభించటంలో ప్రొటోకాల్ పాటించక పోక పోవటంపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా ఎంపీటీసీ సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీలకు ప్రత్యేక గది ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాష, వైస్ ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి, ముసలయ్య, ఎంపీడీఓ కుసుమకుమారి, సీడీపీఓ సీహెచ్ భారతి ఎంఈఓ రఘురామయ్య , చందలూరు పిహెచ్సి వైద్యాధికారి స్పందన తదితరులు పాల్గొన్నారు.



