తాళ్లూరు మండలంలోని దారం వారి పాలెంలో పోలేరమ్మ కొలుపులు ఆదివారం ఘనంగా
నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యాలు చెల్లించి మొక్కులుతీర్చుకున్నారు. బంధు మిత్రుల రాకతో గ్రామంలో పండుగ వాతారణం నెలకొన్నది. ప్రజా ప్రతినిథులు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, సర్పంచిలు వెంకటేశ్వర రెడ్డి, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మంచాల వలసా రెడ్డి, మాజీ ఎఎంసీ డైరెక్టర్ రమణా రెడ్డి,
ఎంపీటీసీలు, పలువురు ప్రముఖలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
నిర్వహించారు. భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేసారు.
