ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వర పురం గ్రామంలో శ్రీ ధ్వజ, శిఖర కలస, ఆంజనేయ, లక్ష్మణ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు దర్శి వైకాపా నాయకులు మద్దిశెట్టి రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో సకాలంలో వర్షాలు పడి రైతులు అభివృద్ధి చెందుతున్నారు అన్నారు. అందులో భాగంగానే గ్రామస్తులు ఐక్యంగా భక్తి కార్యక్రమాలకు సంఘటీతం కావడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మద్దిశెట్టి రవీంద్రకు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, మండల సచివాలయ కోఆర్డినేటర్ మేడికొండ జయంతి, వైస్ ఎంపీపీ వేముల పద్మావతి జానకి రామయ్య. ఉమామహేశ్వరపురం సర్పంచి వేముల పద్మ శ్రీనివాసరావు, పసుపు గల్లు సొసైటీ డైరెక్టర్ జిల్లెలముడి శివయ్య, చింతల అంజిరెడ్డి, చింతల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


