ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల వద్ద ఉన్న వాగులలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పూరిమెట్ల వద్ద ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ కు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ట్రాక్టర్ ను స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ మాట్లాడుతూ వాగుల వద్ద ఎవరైనా రాత్రులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే జైలుకు వెళ్లడం తప్పదు అన్నారు. కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్కు పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
07
May