ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో ఆదివారం ఉదయం 9:32 నిమిషాల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఆ సమయంలో ఇండ్లలో పెద్ద శబ్దం రావడంతో ఇంటిలో పని చేసుకుంటున్న మహిళలు చిన్నారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. గతంలోనూ రెండుసార్లు భూమి కనిపించడంతో తరచూ ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు లో స్వల్ప భూకంపం భయాందోళనలో ప్రజలు
07
May