ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్ బాదం ధనలక్ష్మి కి సోమవారం ప్రజలు బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె మృదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సర్పంచ్ ధనలక్ష్మి సందర్శించి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
