దర్శి డిఎస్పీగా అశోక్ వర్ధన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అద్దంకిలో చేసేటప్పటినుండి దర్శితో, ఇక్కడి ప్రజలతో కొంత పరిచయం ఏర్పడిందని అన్నారు. మా సిబ్బంది సహకారంతో ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూస్తాం అని అన్నారు.
ప్రజలందరి సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ పట్ల అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పారు.
రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ ఏరియాలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని తెలిపారు.
దర్శి డిఎస్పి ని కలిసిన సీఐ రామకోటయ్య ఎస్సైలు..
దర్శి డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అశోక్ వర్ధన్ రెడ్డిని సోమవారం దర్శి సిఐ రామకోటయ్య, ఎస్సైలు రామకృష్ణ, ప్రేమ్ కుమార్ సంపత్ కుమార్ ల తో పాటు డివిజన్లోని పలువురు ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
