రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం. నిర్వహణ

రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సమావేశమైనారు.
ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ సింగ్‌ నేతృత్వంలో సిక్కు పెద్దలతో సమావేశమైనారు.
ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఇక్కడ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపిన సిక్కు పెద్దలు సీఎంకు చెప్పారు.
సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారికోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సిక్కు పెద్దలు సీఎంను కోరారు.
సిక్కులకోసం ఒక కార్పొరేషన్‌ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.
గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై సీఎం అంగీకరించారు.
గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని సీఎం ఆదేశించారు.
గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నారు.
గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సీఎం అంగీకారం తెలిపారు.
ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం వెల్లడించారు.
వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని సీఎం తెలిపారు.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాల్లో కోరారు.
వివిధ సామాజిక వర్గాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలన్న సీఎం చెప్పారు.
10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులు ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *